Page Loader
దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్
ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్ రెండు సెంచరీలు చేశాడు

దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం కాదన్న బెన్ స్ట్రోక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2023
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల తరువాత ఐపీఎల్ అడునున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇక నెల కంటే ఎక్కువ సమయం లేదు. ఈ సమయంలో చైన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అడనుంది. ఆ తర్వాత జూన్ 16 నుంచి ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ మే 28 వరకు కొనసాగుతుంది. ఈ సమయానికి స్టోక్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి తన దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది.

బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్ సాధించిన రికార్డులివే

స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్, ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్‌ సిరీస్‌ సన్నాహాల కోసం ఐపీఎల్‌ టి20 టోర్నీ మొత్తం మ్యాచ్‌లు ఆడబోనని ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ స్పష్టం చేశాడు. 2022 ఏప్రిల్‌లో ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టోక్స్ 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను 10 విజయాలకు నడిపించాడు. తొలిసారిగా ఇంగ్లండ్ పాక్‌లో టెస్టు సిరీస్‌‌ను 3-0తో పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 43 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ 920 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 28 వికెట్లు పడగొట్టాడు. 2018-21 వరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.