IND vs PAK: వికెట్లు తీసినా సెలబ్రేషన్ తీసుకోవడం లేదు.. పాక్‌కు భారత్ పట్టించుకోవడం లేదు : పాక్ మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇటీవల పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 2007 టీ20 వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం తొమ్మిదిసార్లు తలపడగా, భారత్ ఎనిమిది సార్లు గెలిచింది. పాకిస్థాన్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. దీంతో భారత్‌కు పాక్‌పై స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ జట్టు పాకిస్థాన్‌ను అస్సలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నాడు. పాక్ బ్యాటర్ల వికెట్లు తీసినప్పుడు కూడా భారత ఆటగాళ్లు పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదని, అలాగే పాకిస్థాన్‌పై విజయాలను సాధారణ విషయంలా చూస్తున్నారని పేర్కొన్నాడు.
Details
మ్యాచ్ గెలిచినా సంబరాలు చేసుకోవడం లేదు
1990ల దశకంలోని టీమ్ ఇండియాతో పోలిస్తే ప్రస్తుత జట్టు పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పట్లో పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఓటమి భయం ఉండేది. కానీ ఇప్పుడు భారత జట్టు పాకిస్థాన్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. వికెట్లు తీసినా, మ్యాచ్ గెలిచినా పెద్దగా సంబరాలు కనిపించడం లేదని మహమ్మద్ అమిర్ వ్యాఖ్యానించాడు. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.
Details
పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది
చివర్లో శివం దూబే 17 బంతుల్లో 27 పరుగులు జోడించాడు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 18 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా జస్పిత్ బుమ్రా వేగానికి పాక్ టాప్ ఆర్డర్ కకావికలమైంది. మొత్తానికి, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉందని ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది.