Page Loader
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం. జింబాబ్వే రెండో టీ20లో నూరుల్ చూపుడు వేలుకు గాయమైంది. వెంటనే ఆ పర్యటన, ఆసియా కప్ నుండి బంగ్లాదేశ్‌కు దూరమయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి నూరుల్ సింగపూర్‌లోని రాఫెల్స్ హాస్పిటల్‌లో డాక్టర్ ఆందోనీతో వైద్యం చేయించుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్‌లో జరిగే టీ20 ట్రై సిరీస్‌లో ఆడినా.. నొప్పి మాత్రం అతన్ని వేధిస్తూనే ఉంది. దీంతో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్

'సర్జరీ మేరకే ఇంజెక్షన్ ఇచ్చాం'

రెండో టెస్టులో చూపుడు వేలికి నొప్పి ఇంజెక్షన్ తీసుకొని బరిలోకి దిగినట్లు ఆదివారం నూరుల్ చెప్పారు. ''ఆ ఇంజెక్షన్ వల్ల తిమ్మిరిగా ఉంది. కానీ బాల్ తాకినప్పుడు షాక్ కొట్టినట్లు అనిపించింది. దీనికోసం నా కుడి చేతితో బంతిని అడ్డుకున్నా, నొప్పి మాత్రం తగ్గలేదు'' అని తెలిపాడు. 'ప్రస్తుతం శస్త్ర చికిత్సపై నాకు అనుమానాలున్నాయి. అది సరైందో కాదు నాకు తెలియదు. శస్త్రచికిత్స చేయడం తప్పా, కాదా అని నేను ఖచ్చితంగా చెప్పలేను. సర్జరీ చేయించకపోయింటే బాగుండేదని ఇప్పుడు భావిస్తున్నానని' వెల్లడించారు. 'సర్జరీ మేరకు ఇంజెక్షన్ ఇచ్చాం. అతనికి ఇంజక్షన్ అవసరమా లేదా అనేది మాకు ఖచ్చితంగా తెలియదు' అని BCB వైద్యాధికారి వెల్లడించారు.