IND vs PAK: భారత్‌పై మంచి రికార్డు లేదు.. అంగీకరించిన పాక్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు తాము పూర్తిగా సిద్ధమవుతున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15 (ఆదివారం) జరగనున్న భారత్-పాక్ పోరుకు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు అంశాలపై స్పందించారు. భారత్‌పై ప్రపంచకప్ టోర్నీల్లో తమ జట్టుకు అనుకూల రికార్డు లేకపోవడం నిజమేనని అఘా అంగీకరించాడు. గత చరిత్రను మార్చలేం. కానీ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడానికి కృషి చేస్తాం. జట్టులో ప్రతి ఆటగాడి పాత్ర కీలకమేనని చెప్పాడు. స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశాడు . అతని యాక్షన్‌పై ఇప్పటికే ఐసీసీ సమీక్ష నిర్వహించి క్లియర్‌చిట్ ఇచ్చిందని వివరించాడు.
Details
తమకు ఎలాంటి ఆందోళన లేదు
అలాగే సీనియర్ బ్యాటర్ బాబార్ అజామ్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని, ఈ మ్యాచ్‌లో అతడు తప్పకుండా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ క్రమంలో పెద్ద మార్పులు చేసే ఆలోచన లేదని కూడా తెలిపాడు. భారత ఆటగాళ్లతో కరచాలనం విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, వారు ముందుకు వస్తే తామూ చేతులు కలుపుతామని అన్నాడు. భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని బరిలోకి దిగాలని ఆశిస్తున్నామని, అత్యుత్తమ ఆటగాళ్లు ఆడితేనే మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని పేర్కొన్నాడు. టాస్ ప్రాధాన్యంపై ప్రశ్నించగా, మ్యాచ్ ఫలితాన్ని అది నిర్ణయించదని స్పష్టం చేశాడు. ఎవరు మెరుగైన క్రికెట్ ఆడతారో వారిదే విజయం. ఆటే ముఖ్యం... టాస్ కాదని సల్మాన్ అఘా తేల్చిచెప్పాడు.