
Sreesanth: భారత 'సీ' జట్టుపై కూడా పాక్ గెలవలేదు.. మాజీ పేసర్ శ్రీశాంత్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచులో 191 పరుగులకే పాకిస్థాన్ కుప్పకూలింది. ఇక టీమిండియా టార్గెట్ ను 30 ఓవర్లోనే చేధించి విజయం సాధించింది.
అయితే టీమిండియా చేతిలో ఓడిపోయినా పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకొనే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు కోచ్ మైక్ అర్థర్ కామెంట్స్ చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడతాయని ఆర్థర్ కామెంట్స్ చేశాడు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ స్పందించాడు. టీమిండియా 'సీ' జట్టుపై కూడా పాక్ గెలవలేదని పేర్కొన్నారు.
పాకిస్థాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోతోందని, ఇందులో భారత ఆటగాళ్లు ఆరితేరారని శ్రీశాంత్ వెల్లడించారు.
Details
భారత జట్టును ఓడించే సత్తా పాక్ కు లేదు
భారత జట్టును ఓడించే సత్తా పాక్‌కు లేదని, ఐసీసీ టోర్నీలోనే కాదు ఎక్కడైనా పాకిస్థాన్ పై టీమిండియాదే పైచేయి అని శ్రీశాంత్ చెప్పాడు.
భారత మాజీ ప్లేయర్స్‌తో ఓ ఐపీఎల్ టీమ్‌ను ఏర్పాటు చేసినా వారిపై కూడా పాకిస్థాన్ గెలవలేదని వెల్లడించారు.
ఫైనల్‌కు చేరుతామంటూ పాకిస్థాన్ ప్లేయర్స్, మేనేజ్‌మెంట్ కలలు కనడం మానస్తే మంచిదని శ్రీశాంత్ సలహా ఇచ్చాడు.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్స్‌లో మూడు విజయాలతో టీమ్ ఇండియా టాప్ ప్లేస్‌లో నిలవగా.. మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది.