
Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆలౌటైంది.
పాకిస్థాన్ పేసర్లు టీమిండియాను 266 పరుగులకు కట్టడి చేశారు. దాయాది దేశానికి 267 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియాకు 3వ ఓవర్‌లో వర్షం రూపంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.
వర్షం పడటంతో మ్యాచ్‌ను కాసేపు నిలివేశారు.
కొద్దిసేపటికి వర్షం ఆగిపోడవంతో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన గిల్, రోహిత్ పాకిస్థాన్ పేసర్ల ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్‌కు తడబడ్డారు.
క్రికెట్
పాకిస్థాన్ పేసర్ల ధాటికి కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్
పాకిస్థాన్ పేసర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా దాటికి టిమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
షాహీన్ ఆఫ్రిది వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభమైంది.
విరాట్ కోహ్లీ షాహిన్ తర్వాత వేసిన ఓవర్లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వచ్చిన శ్రేయస్ అయ్యర్ కాసేపు క్రీజులో ధాటిగా ఆడినా.. ఆతను ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు.
వెంటనే గిల్ కూడా అవుట్ అయ్యాడు. 66 పరుగుల వద్ద 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను భారత రైజింగ్ బ్యాటింగ్ సంచలనం ఇషాన్ కిషన్, హార్దిక్ ప్యాండ్యా చక్క దిద్దారు.
క్రికెట్
ఇన్నింగ్స్ చక్కదిద్దిన ఇషాన్, పాండ్యా
ఐదో వికెట్‌కు కిషన్, హార్దిక్ పాండ్యా 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అందులో తొమ్మిది బౌండరీలు, రియు రెండు సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో ఇషాన్‌కు ఇది వరుసగా నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీ సాధించాడు. పాండ్యా 90 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌పై వన్డేల్లో అతనికిది రెండో అర్ధశతకం. చివరికి 44వ ఓవర్లో షాహీన్ అఫ్రిది వేసిన బంతికి ఔటై.. సెంచరీ మిస్ చేసుకున్నాడు.
పాండ్యా అవుట్ అయిన తర్వాత వికెట్లు వరుసగా పడ్డాయి. చివరికి స్కోరు 266కు వచ్చేసరికి అందరూ ఔటయ్యారు.