Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 28, 2026
09:36 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్రను లిఖించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా దిగ్గజం ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనం చేసి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. ఛాంపియన్‌గా నిలిచిన అతడికి దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. అంతేకాకుండా ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా పాల్గొనే అర్హతను కూడా ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు.