Loading...
PV Sindhu: కోతుల బెడదకు వింత పరిష్కారం.. నిర్వాహకుల చర్యపై పీవీ సింధు ప్రశంసలు
కోతుల బెడదకు వింత పరిష్కారం.. నిర్వాహకుల చర్యపై పీవీ సింధు ప్రశంసలు

PV Sindhu: కోతుల బెడదకు వింత పరిష్కారం.. నిర్వాహకుల చర్యపై పీవీ సింధు ప్రశంసలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారనుంది. అయితే ఈ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కోతుల సంచారం అధికంగా ఉండటం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే వేదికపై జరిగిన ఇండియా ఓపెన్‌ సమయంలోనూ కోతులు హల్‌చల్‌ చేయడంతో అభిమానులు, నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాలు 

గ్యాలరీల్లోకి దూసుకొచ్చిన కోతులు

ఇండియా ఓపెన్‌ సందర్భంగా కోతులు ఏకంగా ప్రేక్షకుల గ్యాలరీల్లోకి ప్రవేశించడంతో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ జరగనున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

ఇందులో భాగంగా కోతుల బెడదను నియంత్రించేందుకు ఓ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేయబోతున్నారు.

వివరాలు 

కొండముచ్చు శబ్దాలతో కోతులకు చెక్

కోతులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేందుకు కొండముచ్చులు చేసే శబ్దాలను ఉపయోగించాలని నిర్వాహకులు భావించారు.

అయితే ఇందుకోసం నిజమైన కొండముచ్చులను తీసుకురావడం లేదు. వాటి మాదిరిగా అరుపులు, ఈలలు వేస్తూ శబ్దాలు చేయడానికి ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించారు.

తాము చేసే శబ్దాలకు కోతులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాయని ఈ వ్యక్తులు చెబుతున్నారు.

గతంలో ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా ఇదే తరహా విధానాన్ని ఉపయోగించినట్లు వారు తెలిపారు.

ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ చాంపియన్‌షిప్‌ సమయంలో కోతుల బెడదను తగ్గించేందుకు వారిని ప్రత్యేకంగా నియమించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

'వారి శ్రమకు హ్యాట్సాఫ్‌'

ఈ అసాధారణ చర్యపై భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు స్పందించింది.

నిర్వాహకులు అనుసరిస్తున్న విధానం చూస్తే నవ్వు రావొచ్చని, పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు కొంత వింతగా అనిపించవచ్చని ఆమె పేర్కొంది.

అయితే ఓ పెద్ద టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తెర ముందు మాత్రమే కాకుండా తెర వెనుక కూడా ఎంతోమంది కష్టపడుతున్నారని సింధు తెలిపింది.

"వీళ్లు చేస్తున్నది చూస్తే నవ్వు రావచ్చు. మన పరిష్కార మార్గాలు వింతగా అనిపించవచ్చు. కానీ టోర్నీని సమర్థంగా నిర్వహించేందుకు తెర వెనక కూడా ఇలాంటి ఎంతో మంది పని చేస్తున్నారు. వీరి శ్రమకు హ్యాట్సాఫ్‌" అని సింధు వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT

వివరాలు 

'వారి శ్రమకు హ్యాట్సాఫ్‌'

కాగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఆగస్టు 17 నుంచి 23 వరకు జరగనుంది.

ప్రతిష్ఠాత్మక టోర్నీ సందర్భంగా కోతుల బెడద లేకుండా చూసేందుకు నిర్వాహకులు చేపడుతున్న ఈ ప్రత్యేక చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీవీ సింధు చేసిన ట్వీట్ 

ADVERTISEMENT