Page Loader
2023 ఆస్ట్రేలియన్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ఓటమి
ఆస్ట్రేలియా ఓపెన్ నుండి తప్పుకున్న రాఫెల్ నాదల్

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఓపెన్ నుండి రాఫెల్ నాదల్ నిష్క్రమించాడు. రెండో రౌండ్ లో అమెరికన్ మెకెంజీ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి బయటికొచ్చాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నా బరిలోకి దిగిన నాదల్ ఒక సెట్ వెనుకబడ్డాడు. నాదల్ రెండో సెట్ చివరిలో మెడికల్ టైమ్ తీసుకున్నా.. చివరికి పరాజయం పాలయ్యాడు. మెకంజీ మెక్‌డోనాల్డ్ చేతిలో 4-6, 4-6, 5-7 స్కోరుతో రఫెల్ నాదల్ ఓడిపోయాడు.మెక్‌డోనాల్డ్ తొలి రెండు సెట్లు సునాయాసంగా గెలుచుకున్నాడు. మూడో రౌండ్‌లో నాదల్ గాయపడటంతో తిరిగి ఆటపై పట్టు సాధించలేక ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

రాఫెల్ నాదల్‌

రాఫెల్ నాదల్‌కు గాయల బెడద

నాదల్ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. తన చివరి తొమ్మిది మ్యాచ్లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందాడు. మిగిలిన ఏడు మ్యాచ్ లో ఓడిపోయాడు. నాదల్ 2022 ద్వితీయార్ధంలో చాలా వరకు గాయల బెడదతో ఇబ్బంది పడ్డాడు. ఫిటెనెస్ సమస్య కారణంగా అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఎడమకాలికి తగిలిన గాయం వల్ల రఫెల్ నాదల్ సరైన ఆటను ఆడలేకపోయినట్లు తెలుస్తోంది.