రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాఫెల్ నాదల్
టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ రిటైర్మంట్ పై క్లారిటీ ఇచ్చారు. లావర్ కప్ లో తన చిరకాల ప్రత్యర్థి అయిన ఫెదరర్ వీడ్కోలుకు హజరైన తర్వాత తన రిటైర్మెంట్ గురుంచి స్పందించారు.రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. 'ఆ క్షణం దగ్గర ఉందని నాకు తెలుసు.. అందులో ఎటువంటి సందేహాము లేదు. చివరికి అది జరగాల్సి వచ్చినప్పుడు అది జరుగుతుంది. నేను టెన్నిస్ కోర్టులో ఉండాలనుకుంటున్నాను' అని తెలిపారు. నాదల్ తన 21, 22వ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచి ప్రపంచంలో 2వ ర్యాంక్‌ను పొందాడు. స్పెయిన్ ఆటగాడు తన రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నాడని చాలా తెలుసు, నాదల్ ప్రస్తుతానికి దాని గురించి ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు.
ఫెదరర్ రిటైర్మెంట్ ఓ మైలురాయి
ఫెదరర్ వీడ్కోలు గురించి నాదల్ మాట్లాడుతూ మనకు ఇష్టమైన వ్యక్తులు వీడ్కోలు చెప్పడం కష్టతరమన్నారు. మోకాలి ఆపరేషన్లు జరిగిన రెండు నెలల తరువాత ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రీడా ప్రపంచంలోనే ఓ మైలురాయి అని అన్నారు. నాదల్ 2022లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి వింబుల్డన్ సెమీఫైనల్‌కు చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఎక్కువ భాగం గాయాలతో బాధపడ్డాడు వాస్తవానికి నేను పోటిదారుని, చివరికి నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను టెన్నిస్ ప్లేయర్ గా మాత్రమే కాకుండా ఓ క్రీడా అభిమానిగా జీవించాలని నాదల్ పేర్కొన్నారు.