Page Loader
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 14, 2023
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను సృష్టించాడు. సిరీస్ మొత్తం 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై భారత మాజీ స్పిన్నర్ కుంబ్లే(111) వికెట్లను పడగొట్టగా.. తాజాగా అశ్విన్ 114 వికెట్లు తీసి మొదటి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్‌ (10 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు) రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్యమురళీధర్ 11 అవార్డులను గెలుచుకొని మొదటి స్థానంలో ఉన్నాడు.

అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ సాధించిన రికార్డులివే

టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. 236 ఇన్నింగ్స్‌ల్లో 35 సార్లు ఐదు వికెట్లు తీసి అనిల్‌ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. అశ్విన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధికంగా టెస్టులో 26 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రవిచంద్రన్ అశ్విన్ 92 టెస్టు మ్యాచ్‌లు ఆడి 2.77 ఎకనామితో 474 వికెట్లను పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు.