అండర్సన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్
భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును బ్రేక్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్ అండర్సన్ రికార్డును సమం చేశారు. 32సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ పేరిట ఉండేది. ప్రస్తుతం ఈ రికార్డును అశ్విన్ సమం చేశారు. చివరి టెస్టులో అశ్విన్ 6/91తో విజృంభించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖావాజా 180 పరుగులు, గ్రీన్ 114 పరుగులతో విజృభించడంతో ఆసీసీ ఇండియా ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది.
కుంబ్లే రికార్డును బద్దలు కొట్టిన అశ్విన్
అశ్విన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధికంగా 26 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (25 సార్లు) ఐదు వికెట్లు తీశాడు. కుంబ్లే 122 టెస్టుల్లో ఈ ఫీట్ సాధిస్తే, 92 టెస్టుల్లోనే అశ్విన్ ఆ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. భారత స్పిన్ మాంత్రికుడు అశ్విన్ 92 టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్లు సాధించాడు. అండర్సన్ 179 మ్యాచ్‌ల్లో 32సార్లు ఐదు వికెట్లను పడగొట్టాడు.