Page Loader
ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్
టెస్టులో 886 పాయింట్లతో అగ్రస్థానికి చేరుకున్న జేమ్స్ అండర్సన్

ప్రపంచ నెం.1 టెస్టు బౌలర్‌గా జేమ్స్ అండర్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

40 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన రికార్డును సాధించాడు. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. జేమ్స్ అండర్సన్ 886 పాయింట్లతో టెస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి ఎగబాకాడు. అయితే జేమ్స్ అండర్సన్‌కు రవిచంద్రన్ అశ్విన్‌కి కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఆల్ రౌండర్లలో జాబితాలో రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బే ఓవల్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ 267 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ విజయంలో జేమ్స్ కీలక పాత్ర పోషించాడు.

జేమ్స్ అండర్సన్

అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచిన అండర్సన్

ఇప్పటి వరకు జేమ్స్ అండర్సన్ 178 మ్యాచ్‌లు ఆడి 25.94 సగటుతో 682 వికెట్లు తీశాడు. ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు షేన్ వార్న్ 708 వికెట్లు అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. నాలుగేళ్లుగా టెస్టులో నంబర్ వన్ బౌలర్ గా కొనసాగిన పాట్ కమిన్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం కారణంగా రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అండర్సన్ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఇది ఆరోసారి కావడం విశేషం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్ట్‌ల్లో అశ్విన్ చెలరేగితే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడు.