అండర్సన్ దూసుకొచ్చినా అశ్వినే నెంబర్ వన్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 859 పాయింట్లతో అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నెంబర్ వన్ స్థానంలో సమానంగా నిలిచారు.
గతవారం ప్రపంచ నెంబర్ వన్ టెస్టు బౌలర్‌గా అవతరించిన అశ్విన్.. ఇండోర్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
ఈ జాబితాలో కొద్దిరోజుల క్రితం వరకూ నెంబర్ వన్ స్థానంలో ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్.. 849 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
రవీంద్ర జడేజా
ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా నెంబర్ వన్ స్థానం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి నాథన్ లియాన్ 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'కు ఎంపికయ్యాడు. తాజాగా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్‌లో టాప్-10లోకి నాథన్ ప్రవేశించి, తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
772 పాయింట్లతో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 787 పాయింట్లతో ఆరోస్థానంలో బుమ్రా నిలిచాడు.
టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా సూపర్ స్టార్ రవీంద్ర జడేజా 445 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా అశ్విన్.. 363 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు