సంచలన రికార్డును బద్దలుకొట్టనున్న రవిచంద్రన్ అశ్విన్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మార్చి 9న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే చివరి టెస్టులో మరో అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశాడు. అంతర్జాతీయ కెరియర్లో 700 వికెట్లను పడగొట్టడానికి కేవలం 10 వికెట్ల దూరంలో అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఘనతను అనిల్ కుంబ్లే (956), హర్భజన్ సింగ్ (707) మాత్రమే సాధించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ 15.72 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 269 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 690 వికెట్లను తీశాడు. ప్రస్తుతం టెస్టు బౌలింగ్ ర్యాకింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తొమ్మిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్న అశ్విన్
అశ్విన్ 91 టెస్టులు మ్యాచ్‌లు ఆడి 23.97 సగటుతో 467 వికెట్లను తీశాడు. టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలో 113 మ్యాచ్‌లు ఆడి 151 వికెట్లు పడగొట్టాడు. జూన్ 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి అశ్విన్ ఓవరాల్‌గా 690 వికెట్లు తీసి సత్తా చాటాడు. జేమ్స్ ఆండర్సన్ 205 మ్యాచ్‌లలో 628 వికెట్ల తీసి అశ్విన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. అశ్విన్ కంటే ఎక్కువ టెస్టు వికెట్లు సాధించిన వారిలో అండర్సన్ (520), స్టువర్ట్ బ్రాడ్ (493), ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ (479) మాత్రమే ఉన్నారు. అశ్విన్ ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు.