Page Loader
ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్
31 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు

ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ్‌పూర్ మొదటి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో రోజు కూడా ఆట ముగియకముందే ఆస్ట్రేలియా 132 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ కొన్ని రికార్డులను కొల్లగొట్టాడు. టెస్టులో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అదే విధంగా 31 సార్లు ఐదు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మాథ్యూ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీల వికెట్లు తీసి ఈ ఘనతను సంపాదించాడు.

రవిచంద్రన్ అశ్విన్

67 సార్లు ఐదు వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్

నాగ్‌పూర్‌లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది, లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ 1-0 ఆధిక్యంతో ఇండియా నిలిచింది. శ్రీ‌లంక దిగ్గ‌జం ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 67 సార్లు 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆస్ట్రేలియా దివంగ‌త స్పిన్న‌ర్ షేన్ వార్న్ (37 సార్లు), న్యూజిలాండ్ బౌల‌ర్ హ్యాడ్లీ (36) వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భార‌త మాజీ లెగ్ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే 35 సార్లు 5 వికెట్ల తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు రెండో టెస్టు శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది