ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మహిళల జట్టుకు ప్రధాన కోచ్ బెన్ సాయర్ ను నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. గతంలో సాయర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు. సాయర్ ఆస్ట్రేలియన్ క్రికెట్ కోచ్ గా అందరికి సుపరిచితుడే. ది హండ్రెడ్‌లోని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు ప్రచారకర్తగా పనిచేశారు. సాయర్ గతంలో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రధాన కోచ్‌గా, ఆస్ట్రేలియా మహిళల అసిస్టెంట్ కోచ్‌గా, న్యూ సౌత్ వేల్స్ బ్రేకర్స్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
ఆర్సీబీ మెంటర్‌గా సానియా మిర్జా
ఆర్సీబీ ప్రధాన్ కోచ్ గా బెన్ సాయర్, ఫీల్డింగ్ కోచ్ గా వనిత, టీమ్ మెంటర్ గా భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా నియామకయ్యారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆర్సీబీ 18 మంది ఆటగాళ్లను రూ.11.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో 12 మంది భారత మహిళా ప్లేయర్లు, ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, ఆశా శోబనా, కనికా అహుజా, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖేమ్నార్, కోమల్ గంజాట్డ్, కోమల్ జంచుడ్ పవార్, హీథర్ నైట్, శ్రేయాంక పాటిల్