Page Loader
ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా
ఆర్సీబీ మెంటర్‌గా ఎంపికైన సానియా మిర్జా

ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఫ్రాంచైజీ నూతన సంప్రదాయానికి తెర లేపింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను ఆర్సీబీ మెంటర్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా బుధవారం వెల్లడింది. యూత్ ఐకాన్, భారత ఛాంపియన్ సానియా మిర్జాను మెంటర్‌గా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి మేజర్ టోర్నమెంట్ ఆడింది. బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సానియా క్రికెట్లో అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు.

సానియా మిర్జా

ఆర్సీబీ మెంటర్‌గా ఎంపిక కావడంపై హర్షం

ఆర్సీబీ మెంటర్‌గా ఎంపిక కావడంపై సానిమా మిర్జాను సంతోషం వ్యక్తం చేశారు.ఇటీవలే సానియా ఆటకు వీడ్కోలు పలికింది. అయితే ఇప్పుడు క్రికెట్ రంగంలో కనిపించనున్నారు. ఇటీవల వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను ఆర్‌సీబీ 3.4 కోట్లు ధరను పలికి దక్కించుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ 23రోజుల పాటు సాగనుంది. మొదటి మ్యాచ్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది