LOADING...
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు రికీ మార్టిన్ లైవ్ షో
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు రికీ మార్టిన్ లైవ్ షో

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముందు రికీ మార్టిన్ లైవ్ షో

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 చివరి సీగ్మెంట్‌కు చేరింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌కు ముందు స్టేడియాన్ని హోరెత్తించేందుకు ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ లైవ్ ప్రదర్శన ఇచ్చనున్నారు. ఈ సూపర్ ఎంటర్టైన్‌మెంట్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ప్రకటన ప్రకారం, "టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేడుక మరింత ఘనంగా మారింది. ఫైనల్ ముందు జరిగే ముగింపు వేడుకలో గ్లోబల్ ఐకాన్ రికీ మార్టిన్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎవరూ మిస్ అవ్వకూడదని పేర్కొంది.

Details

 రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్

నిర్వాహకులు స్టేడియం గేట్లు మధ్యాహ్నం 3:30 గంటలకు తెరిచే వివరాలు కూడా వెల్లడించారు. వినోద కార్యక్రమాల అనంతరం రాత్రి 7:00 గంటలకు అసలు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా గురువారం వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఇది టీ20 చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరిన నాలుగో సందర్భం. మరోవైపు, న్యూజిలాండ్ బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా, టైటిల్‌ను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా, అలాగే మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించేందుకు భారత్ ఉత్సాహంగా ఉంది.

Advertisement