Rishabh Pant: రిషబ్ పంత్ బర్తడే.. బీసీసీఐ స్పెషల్ పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ద్వారా రిషబ్ పంత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. '154 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 5,507 ఇంటర్నేషనల్ రన్స్, వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా 250 డిస్మిసల్స్, 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేత, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత, ధైర్యవంతుడైన రిషభ్ పంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ తన పోస్టులో పేర్కొంది. ఇటీవల ఇంగ్లండ్‌తో అండర్సన్-తెందూల్కర్ ట్రోఫీ సమయంలో రిషబ్ పంత్ పాదానికి తీవ్ర గాయం పడింది. గాయంతో ఒక మ్యాచ్‌లోక్రీజ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Details
ఆరు వారాల విశ్రాంతి అవసరం
మెడికల్ స్కానింగ్‌లో పాదంలో ఎముక విరిగినట్లు తేలడంతో వైద్యబృందం కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరం అని సూచించింది. ఈ కారణంగా పంత్ ఆసియా కప్‌లో పాల్గొనలేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ ఆడటం లేదు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్ ఆడతాడో లేదో ఇంకా స్పష్టత లేదు. దాదాపు మూడేళ్ల క్రితం (2022 డిసెంబర్) పంత్ రోడ్డు ప్రమాదానికి గురయాడు, అక్కడినుంచి కోలుకొని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ టూర్‌లో బంతి బలంగా తాకడంతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న పంత్ త్వరగా కోలుకొని జట్టుతో చేరాలని అభిమానులు కోరుతున్నారు.