
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు 'రోహిత్ శర్మ' సిద్ధం.. తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి దగ్గరగా ఉన్నాడు.
హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 300 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు.
ఈ రోజు మధ్యాహ్నం ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో రోహిత్ 300 సిక్సర్ల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
Details
అగ్రస్థానంలో క్రిస్ గేల్
గేల్ 142 మ్యాచ్‌లలో 357 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 265 మ్యాచ్‌లలో 295 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 261 మ్యాచ్‌లలో 285 సిక్సర్లు కొట్టాడు.
ఎంఎస్ ధోనీ (260), ఏబీ డివిలియర్స్ (251) టాప్ 5లో కొనసాగుతున్నారు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా క్రిస్ గేల్ ఉంచుకున్నాడు.
గేల్ మొత్తం 1056 సిక్సర్లు బాదాడు. కీరన్ పోలార్డ్ (908), ఆండ్రీ రసెల్ (737), నికోలస్ పూరన్ (630), కొలిన్ మున్రో (557), అలెక్స్ హేల్స్ (552), రోహిత్ శర్మ (540), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (530), జోస్ బట్లర్ (528), డేవిడ్ మిల్లర్ (505) ఈ జాబితాలో ఉన్నారు.