Page Loader
ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?
రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?

ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టుకు అద్భుత విజయాలను అందించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. టీ20 ఇంటర్నేషనల్‌లో విరాట్, రోహిత్ శర్మకు చోటు దక్కదని తెలుస్తోంది. హార్దిక్ నాయకత్వంలో యువ ఆటగాళ్లను చేర్చుకోవాలని BCCI యోచిస్తోందట. భారత్ యువ ఆటగాళ్లు శ్రీలంక టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్‌కు రోహిత్, విరాట్ ఇద్దరు దూరమయ్యారు. యువ ఆటగాళ్ల ప్రదర్శనను చూసి బీసీసీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్ జట్టు టీ20 ప్రపంచ్ కప్‌కు సిద్ధమవుతోందని, దీంతో ఇద్దరు సీనియర్ బ్యాట్స్ మెన్స్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పారు.

రోహిత్ శర్మ

టీ20లకు దూరం కాలేదన్న రోహిత్ శర్మ

2007లో వన్డేల్లో రోహిత్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన మొదటి T20Iని అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఆడాడు. మరోవైపు, విరాట్, ఆగష్టు 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, జూన్, 2010లో మొదటి T20ని కోహ్లీ ఆడాడు. ఇద్దరూ T20 ప్రపంచ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ 115 మ్యాచ్ లో 52.73 సగటుతో 4008 పరుగులు చేశాడు. రోహిత్ 148 మ్యాచ్ లో 31.32 సగటుతో 3853 పరుగులు చేశాడు. శ్రీలంకతో వన్డేకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ తాను టీ20లు అప్పుడే వదిలిపెట్టబోనన్నాడు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలు మాత్రం వేరుగా ఉన్నాయి.