రోహిత్.. సరిగ్గా రెండేళ్ల తర్వాత సూపర్ హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2017 నుంచి ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్నాడని విమర్శలు వినపడుతున్నాయి. ఇక గతేడాది ఐపీఎల్‌లో రోహిత్ సగటు రూ.19.14 మాత్రమే. చివరిగా రోహిత్ హాఫ్ సెంచరీ చేసి రెండేళ్లు అయిపోయింది. 2021 ఐపీఎల్ తర్వాత రోహిత్ శర్మ మళ్లీ హాఫ్ సెంచరీ చేయలేదు. అయితే మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ విజృంభించాడు. ఎట్టకేలకు 24 ఇన్నింగ్స్ ల తర్వాత మళ్లీ హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రోహిత్ శర్మ కు ఫ్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డు
173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి గిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించాడు. ఇషాన్ కిసాన్ తో కలిసి మొదటి వికెట్ కు 71 పరుగులు జోడించారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. ఈ ఐపీఎల్ లో అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచాడు. రోహిత్ తర్వాత మయాంక్ అగర్వాల్ 21 ఇన్నింగ్స్‌లు, మురళీ విజయ్ 20 ఇన్నింగ్స్ ల తర్వాత హాఫ్ సెంచరీని నమోదు చేయడం గమనార్హం.