క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే
క్రికెట్లో అభిమానులందరూ సచిన్‌ను దేవుడితో కొలుస్తారు. ధోని నుంచి కోహ్లీ వరకూ అందరూ సచిన్‌ను ఆరాధిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ ఎంతోమంది స్ఫూర్తిధాయకంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ కు ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కనుంది. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనునడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో క్రికెట్ అభిమానుు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటికే సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉండడం విశేషం
విగ్రహానికి సచిన్ అనుమతి లభించింది
సచిన్ పుట్టిన రోజైన ఏప్రిల్ 24న లేదా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని అవిష్కరిస్తామని , ఇప్పటికే సచిన్ నుంచి అనుమతి వచ్చిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే చెప్పారు. 1989లో సచిన్ క్రికెట్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్, 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలున్నాయి. 463 వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 18426 పరుగులు చేశాడు.