Saina Nehwal: సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం.. ఆటకు వీడ్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల బ్యాడ్మింటన్‌కు దిశానిర్దేశం చేసిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆటగాళ్ల ఆధిపత్యానికి గండి కొట్టి ప్రపంచ స్థాయిలో అత్యున్నత విజయాలు సాధించిన సైనా, ఇకపై రాకెట్ వదిలేస్తున్నట్లు ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఆమె ఆటకు దూరంగా ఉన్నప్పటికీ సోమవారం తన వీడ్కోలు నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేసింది. సైనా చివరిసారిగా 2023లో సింగపూర్ ఓపెన్‌లో పోటీ పడింది. ఈ సందర్భంగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన 'ఆమె రెండేళ్ల కిందటే నేను ఆట ఆపేశాను. నా అంతట నేను ఆటలోకి వచ్చాను.. నా అంతట నేను బయటకు వెళ్తున్నాను. అందుకే ప్రత్యేకంగా ప్రకటించడం అవసరం లేదనుకున్నాను.
Details
మోకాళ్ల సమస్యే ప్రధాన కారణం
ఇక ఆడగలిగే సామర్థ్యం లేకపోతే కథ అక్కడితో ముగిసినట్టే. అంతేనని వ్యాఖ్యానించింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి ప్రధాన కారణమని సైనా వెల్లడించింది. రిటైర్‌మెంట్‌ను లాంఛనంగా ప్రకటించాల్సిన అవసరం తనకు అనిపించలేదని కూడా ఆమె స్పష్టం చేసింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సైనా నెహ్వాల్ సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.