Page Loader
Sania Mirza: 'ఓ తల్లిగా ఈ సమస్య తెలుసు'.. సానియా మీర్జా కొత్త ప్రయాణం

Sania Mirza: 'ఓ తల్లిగా ఈ సమస్య తెలుసు'.. సానియా మీర్జా కొత్త ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌లో చిన్నారుల ఫిట్‌నెస్, చదువు కోసం సృష్టించిన 'సీసా స్పేసెస్' గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థతో కలిసి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భాగస్వామ్యాన్ని ప్రకటించారు. కొత్త ఏడాదిలో సీసా స్పేసెస్‌తో కలిసి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు సానియా వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఉన్న సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీసా స్పేసెస్ భాగస్వాములైన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి కూడా హాజరయ్యారు.

వివరాలు 

ఈ అంశాల్లో సీసాతో కలిసి పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను

ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ, "ఇప్పుడు పిల్లలు ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. అన్నం తినేటప్పుడు కూడా ఫోన్ లేదా టీవీ అవసరం అవుతోంది. ఓ తల్లిగా నాకు ఈ సమస్య బాగా అర్థమైంది. పిల్లల కోసం చదువు మాత్రమే కాకుండా, మంచి వాతావరణం, ఫిట్‌నెస్, సక్రమమైన ఆహారం చాలా అవసరం. ఈ అంశాల్లో సీసాతో కలిసి పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను," అని చెప్పారు. శ్రీజ కొణిదెల మాట్లాడుతూ, "ఈ కేంద్రం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో కొంత సమయం గడిపే అవకాశాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం," అని తెలిపారు.