సానియా మీర్జా: వార్తలు

ఓటమితో టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్‌కి గుడ్‌బై చెప్పింది. చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆటకు పుల్‌స్టాప్ పెట్టింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లోనే భారత్‌కి చెందిన సానియా, అమెరికాకి చెందిన మాడిసన్‌ కీస్‌ జోడీ ఓటమిని చవిచూసింది.

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సానియా పరాజయం

సానియా మీర్జా తన కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను ఓటమితో ముగించింది. బ్రెజిల్ జోడి లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. మ్యాచ్‌ తర్వాత సానియా మిర్జా భావోద్వేగానికి గురైంది. 18 ఏళ్ల గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావించిన సానియాకు నిరాశే ఎదురైంది.