Page Loader
Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా? 
Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా?

Shoaib Malik: మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. మరీ సానియాకు విడుకులు ఇచ్చాడా? 

వ్రాసిన వారు Stalin
Jan 20, 2024
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. షోయబ్ మాలిక్ విడిపోయారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పెళ్లి జరగడం గమనార్హం. షోయబ్ మాలిక్ శనివారం తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్‌'లో వివాహ ఫొటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మాలిక్, సనా జావేద్ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇద్దరి పెళ్లి ఫొటోలు బయటకు రావడం సంచలనంగా మారింది.

పాకిస్థాన్

సనా జావేద్‌కు రెండోది.. షోయబ్‌కు మూడోది

సనా జావేద్‌కు ఇది రెండో పెళ్లి. సనా జావేద్ 2020 సంవత్సరంలో ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. 2023లో వీరిద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే, మాలిక్‌కు ఇది మూడో పెళ్లి. 2010లో సానియా మీర్జాను షోయబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు అయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్న షోయబ్.. ఆమెకు విడాకులు ఇచ్చి.. సానియాను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. సనా జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయోలో తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పెళ్లి ఫొటోలను షేర్ చేసిన షోయబ్ మాలిక్