ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో సానియా పరాజయం
సానియా మీర్జా తన కెరీర్ గ్రాండ్ స్లామ్‌ను ఓటమితో ముగించింది. బ్రెజిల్ జోడి లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడి ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత సానియా మిర్జా భావోద్వేగానికి గురైంది. 18 ఏళ్ల గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను టైటిల్‌తో ముగించాలని భావించిన సానియాకు నిరాశే ఎదురైంది. టైటిల్ పోరులో సానియా-బోపన్న జోడి వరుస సెట్లలో పరాజయం పాలైంది. రాడ్‌లావర్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో భారతజోడీ 6-7 (2-6), 2-6తో ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్ ను సానియా ముగించింది. వచ్చేనెలలో జరగనున్న దుబాయ్ ఓపెన్‌లో ఆడనుంది. అదే తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు ఆఖరి టోర్నమెంట్ కావడం గమనార్హం. ఫిబ్రవరి చివరి నాటికి సానియా రిటైర్ కానున్నారు.
43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటిన సానియా
బోపన్న ఫోర్‌హ్యాండ్‌తో భారత్‌కు మొదటి పాయింట్లు అందించడానికి ముందు భారత్ 0-3తో వెనుకబడింది. అయితే, బ్రెజిల్ తొలి సెట్‌ను 7-6 (6-2)తో చేజార్చుకుంది. సెకండ్ సెట్ పూర్తిగా ఏకపక్ష తప్పిదం కారణంగా బ్రెజిల్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లి సర్వ్ బ్రేక్ చేసింది. వెంటనే ఆధిక్యం 4-1 అయింది. అనంతరం మాటోస్, స్టెఫానీ సెట్‌ను ముగించారు. సింగిల్స్ ప్లేయర్‌గా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ఆరంభించిన సానియా తర్వాత డబుల్స్, మిక్సడ్ డబుల్స్ ప్లేయర్‌గా మారింది. డబుల్స్, మిక్సడ్ డబుల్స్‌లో ఎన్నో మరుపురాని విజయాలను అందుకొని సత్తా చాటింది. ఆరు గ్రాండ్ స్లామ్‌లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లను గెలుచుకొని రికార్డులను సృష్టించింది.