Page Loader
Sania Mirza: టెన్నిస్ టార్చ్ బేరర్ సానియా మీర్జా.. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం
టెన్నిస్ టార్చ్ బేరర్ సానియా మీర్జా.. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం

Sania Mirza: టెన్నిస్ టార్చ్ బేరర్ సానియా మీర్జా.. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ టెన్నిస్‌లో టార్చ్ బేరర్ సానియా మీర్జా(Sania Mirza.) మన దేశం ఆటకాని టెన్నిస్‌లో నంబర్ వన్ క్రీడాకారిణిగా సానియా మీర్జా ఎదిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. నేటితో ఆమె 37 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఇవాళ సానియా పుట్టిన రోజు సందర్భంగా ఆమె సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం. 1986, నవంబర్ 15న హైదరాబాదులో ఇమ్రామన్ మీర్జా, నసీమాకు సానియా జన్మించింది. మొదట సానియా హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్‌లో విద్యను అభ్యసించింది. తర్వాత హైదరాబాదులోని సెయింట్ మెరీస్ కాలేజీలో పట్టభద్రురాలయ్యింది. ఇక సానియా ఆరేళ్ల వయస్సులో టెన్నిస్ ఆడడం ప్రారంభించింది.

Details

2015లో నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా

2003లో తొలి డబ్ల్యూటీఏ మ్యాచ్ ఆడిన ఆమె, 15 ఏళ్ల వయస్సులోనే లియాండర్ జతగా 2002 ఆసియా క్రీడల్లో మిక్సెడ్ డబుల్ గెలిచింది. అదే ఏడాది యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌కి చేరి, డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ గెలిచిన నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2007లో సింగిల్స్ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. ఇక డబుల్స్‌లో 2015 ఏప్రిల్‌లో సానియా నెంబర్ వన్ ర్యాంకును అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కింది. 21 నెలలుగా ఆమె టాప్ ర్యాంకులో కొనసాగడం విశేషం.

Details

2023లో టెన్నిస్ కు వీడ్కోలు చెప్పిన సానియా మీర్జా

సానియా తన కెరీర్‌లో మూడు మహిళల డబుల్ టైటిల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్, ఉమెన్స్ డబుల్స్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, మిక్స్ డ్ బుల్స్ లో ఆస్ట్రేలియా ఓపెన్, ప్రెంఛ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుంది. ఇక సానియా మీర్జా 2013లో పాకిస్థాన్ క్రికెటర్‌ను షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇజహాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2011లో సానియా టెన్నిస్‌లో అరంగ్రేటం చేసింది. 2023 మార్చిలో టెన్నిస్‌కు ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది.