Page Loader
రిటైర్మెంట్ ప్రకటించినా.. మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైన సానియా మీర్జా!
మళ్లీ ఆడనున్న సానియా మీర్జా

రిటైర్మెంట్ ప్రకటించినా.. మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి సిద్ధమైన సానియా మీర్జా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 03, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీ చేయడానికి సిద్ధమైంది. కాగా ప్రధాన వింబుల్డన్ డ్రాలో సానియా పోటీ చేయకపోవడం గమనార్హం. లేడీస్ లెజెండ్స్ ఇన్విటేషన్ డబుల్స్ లో సానియా బరిలోకి దిగనుంది. బ్రిటన్‌కు చెందిన జోహన్నా కొంటాతో సానియా భాగస్వామ్యం కానుండడం విశేషం. 32 ఏళ్ల జోహన్నా కొంటా బ్రిటన్ తరుపున ఆడటానికి ముందు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. అయితే 2021 ఎడిషన్ చివరి ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. వీరిద్దరూ ఈ ఏడాది వింబుల్డన్‌కు హాజరవుతారని సానియా మీర్జా తండి ఇమ్రాన్ మీర్జా వెల్లడించారు.

Details

జూలై 3 నుంచి వింబుల్డన్ ప్రధాన మ్యాచులు

ఈ టోర్నమెంట్‌లో సానియా మీర్జా మాజీ డబుల్స్ భాగస్వామి మార్టినా హింగిస్, నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ కిమ్ క్లిజ్‌స్టర్స్ సహా పలువురు రిటైర్డ్ స్టార్స్ పోటీ పడనున్నారు. వింబుల్డన్ 2023 మెయిన్ డ్రాలో ప్రవేశించిన రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో తలపడనున్నారు. జూలై 5న పురుషుల డబుల్స్ ఈవెంట్ తొలి రౌండర్ ఆస్ట్రేలియా ఆటగాడితో కలిసి అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో డురాన్, టోమస్ మార్టిన్ ఎట్చెవెరీతో తలపడనున్నారు. రోహన్ బోపన్న మాట్లాడుతూ డేవిస్ కప్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని, అయితే తన బాడీ సహకరించే వారు ATP టూరులో ఆడుతానని స్పష్టం చేశారు. వింబుల్డన్ 2023 ప్రధాన రౌండ్ మ్యాచులు జూలై 3 నుంచి ప్రారంభం కానున్నాయి.