Page Loader
Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది'
Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది'

Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది'

వ్రాసిన వారు Stalin
Jan 21, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ శనివారం నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సానియా మీర్జాతో షోయబ్ విడిపోయినట్లు ప్రపంచానికి తెలిసింది. షోయబ్ పెళ్లి గురించి 'ది పాకిస్థానీ డైలీ'లో వచ్చిన ఒక వార్త ఆసక్తికరంగా మారింది. సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడం అతని కుటుంబానికి ఇష్టం లేదని 'ది పాకిస్థానీ డైలీ' రాసుకొచ్చింది. అందుకే షోయబ్ కుటుంబ సభ్యులెవరూ వివాహానికి హాజరు కాలేదు. షోయబ్ నుంచి సానియా మీర్జా ఎందుకు విడిపోవాలని నిర్ణయించుకున్నారనే విషయం కూడా పాకిస్థానీ డైలీ వెల్లడించింది. షోయబ్‌కు ఉన్న వివాహేతర సంబంధాలతో సానియా మీర్జా విసిగిపోయిందని స్వయంగా అతని సోదరి చెప్పినట్లు 'ది పాకిస్థానీ డైలీ'లో రాసుకొచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్థాన్ డైలీ ట్వీట్