LOADING...
Jasprit Bumrah: వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. కానీ వేరే ఆటగాడికి 'ఇంపాక్ట్ ప్లేయర్' మెడల్
వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. కానీ వేరే ఆటగాడికి 'ఇంపాక్ట్ ప్లేయర్' మెడల్

Jasprit Bumrah: వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. కానీ వేరే ఆటగాడికి 'ఇంపాక్ట్ ప్లేయర్' మెడల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్‌‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్, మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది. వెస్టిండీస్‌పై సంజు శాంసన్ (97*) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆడుతూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. కానీ 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' మెడల్ జస్‌ప్రీత్ బుమ్రాకు దక్కింది. ఒకే ఓవర్‌లో డేంజరస్‌ బ్యాటర్ల షిమ్రోన్ హెట్‌మయెర్, రోస్టన్ ఛేజ్‌ను వికారంగా కూల్చి బుమ్రా వెస్టిండీస్‌ భారీ స్కోరు సాధించకుండానే ఆడాడు. మ్యాచ్ తర్వాత బుమ్రా తన సతీమణి, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో సంజు శాంసన్, శివమ్ దూబే ప్రదర్శనపై ప్రశంసలు తెలిపారు.

Details

సంజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు

శివమ్‌ దూబె చివరి ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టాడు. దాంతో మాపై ఒత్తిడి పూర్తిగా పోయింది. క్రికెట్‌లో ఈ రెండు ఫోర్ల విలువ గణనీయంగా ఉంటుంది, ఎందుకంటే చివరి ఓవర్‌లో ఎనిమిది లేదా తొమ్మిది పరుగులు చేయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే లక్ష్య ఛేదనలో ముందే ఎక్కువ పరుగులు రాబట్టడం ముఖ్యమని బుమ్రా పేర్కొన్నారు. గత నెల వరకు సంజు కెరీర్‌లో కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. అయినా ఓపికగా తన ఛాన్స్ కోసం వేచి ఉండి, అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఆడాడు. తన కర్తవ్యం ఏంటో అతడికి తెలుసు. సంజు సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇదే దూకుడుతో ఆడాలని కోరుకుంటున్నానని బుమ్రా వెల్లడించారు.

Advertisement