
Team India:Team India: సంజు శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.. భారత జట్టు మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంకా కొన్ని రోజుల్లోనే యూఏఈలో ప్రతిష్టాత్మక ఆసియా కప్ (Asia Cup) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్ల స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్ (Sanju Samson) బ్యాటింగ్ ఆర్డర్‌పై అనిశ్చితి నెలకొంది. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) సంజు శాంసన్ గురించి తన విశ్లేషణను వెల్లడించాడు. "సంజు శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అతడు గత సిరీస్‌లోనూ ఆడాడు. అంతేకాదు, గత 12 మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు సాధించాడు. అలాంటి ఆటగాడిని టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలి.
Details
రెండు, మూడు స్థానాల్లో అవకాశం ఇవ్వాలి
ఎందుకంటే, నాలుగు నుంచి ఏడు స్థానాల మధ్య అతడు 98 మ్యాచ్‌లు ఆడినా, అతని యావరేజ్ 20, స్ట్రైక్‌రేట్ 126 మాత్రమే ఉన్నాయి. ఆ స్థానాల్లో అతడి గణాంకాలు బలంగా లేవు. అందువల్ల ఒకటి, రెండు, మూడు స్థానాల్లోనే అతనికి అవకాశమివ్వాలి. అకస్మాత్తుగా అతడి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తే.. అతని ప్రదర్శన పడిపోతుందని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పష్టం చేశాడు.
Details
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం
అలాగే జితేశ్ శర్మ (Jitesh Sharma) గురించి కూడా ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. 'జితేశ్ శర్మ తుది జట్టులో తప్పనిసరిగా ఉండాలి. అతని స్ట్రైక్‌రేట్ 166, యావరేజ్ 28గా ఉంది. స్ట్రైక్‌రేట్ 150 పైన ఉన్న బ్యాటర్లలో అతడే అగ్రస్థానంలో నిలిచాడు. అతని గణాంకాలు అందరికంటే బలమైనవి. ఆసియా కప్‌లోనూ అతడు అదే స్థాయిలో రాణిస్తాడని నేను ఆశిస్తున్నాని అన్నాడు. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్‌ల మధ్య జరగనుంది. టీమ్‌ఇండియా తన తొలి పోరును సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.