Page Loader
Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు! 
సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు!

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్ సెంచరీ.. ముంబై తరుపున తొలి బ్యాటర్‌గా అద్భుత రికార్డు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ రెస్ట్ ఆఫ్‌ ఇండియా, ముంబయి మధ్య జరుగుతున్న ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 253 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 150 బంతుల్లో శతకం పూర్తి చేసిన అనంతరం 103 బంతుల్లో డబుల్ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ కొత్త రికార్డును సృష్టించాడు.

Details

క్రీజులో సర్ఫరాజ్ ఖాన్, శార్దుల్ ఠాకూర్

రెండో రోజు 132 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ముంబయి 516/8 స్కోరుతో ఉంది. సర్ఫరాజ్‌ (216 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్‌ (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు సర్ఫరాజ్‌ ఎంపిక కాగా, కానీ రెండు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. మొదటి టెస్టు జరిగినప్పుడు దులీప్ ట్రోఫీ, రెండవ టెస్టులో ఇరానీ కప్‌ కారణంగా అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఈ డబుల్ సెంచరీతో అక్టోబర్ 16 నుండి న్యూజిలాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టెస్టుల సిరీస్‌లో తాను తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు.