
పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సంచలన రికార్డును నమోదు చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20ల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాక్ తరుపున టీ20ల్లో 100 వికెట్లు తీసిన తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
పాక్ నుంచి టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండ్ షాహిద్ అఫ్రిది పేరిట ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డును షాదాబ్ ఖాన్ అధిగమించాడు.
మూడో టీ20 మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీయడంతో ఆప్ఘనిస్తాన్ 116 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది.
షాబాద్ ఖాన్
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా షాబాద్ ఖాన్
టిమ్‌సౌతీ, షకీబ్ అల్ హసన్, రషీద్‌ఖాన్, ఇష్ సోధి, మలింగ, ముస్తాఫిజుర్ రెహమాన్ తర్వాత ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన ఏడో ఆటగాడిగా షాబాద్ ఖాన్ నిలిచాడు.
షాదాబ్ ఖాన్ ఇప్పటివరకూ 87 టీ20 మ్యాచ్‌లు ఆడి 100 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు సార్లు మూడు వికెట్లు తీశాడు.
ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లో పాక్ ఓడిపోయి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. మూడు టీ20 మ్యాచ్‌లో 183 లక్ష్య చేధనకు ఆప్ఘన్ 18.4 ఓవర్లకు కేవలం 116 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించిన షాదాబ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.