బాబర్ కంటే కోహ్లీనే బెస్ట్ : పాక్ మాజీ ఆల్ రౌండర్
ప్రపంచ స్థాయి క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఇద్దరు బెస్ట్ క్రికెటర్లుగానే కనిపిస్తారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, ఫీల్లిండ్, కెప్టెన్సీ ఇలా చెప్పుకుంటూ అన్నింట్లో అత్యుత్తమంగా రాణిస్తాడు. ప్రస్తుతం విరాట్‌తో బాబర్ ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. నిలకడైన ఆటతీరు, ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించడం వంటి అంశాల్లో విరాట్, బాబర్ సరిమానులే కొందరు చెబుతుంటారు. బాబర్ మాత్రం కెరీర్ మొదట్లో తడబడినా.. ప్రస్తుతం ప్రపంచ స్థాయి క్రికెటర్లతో పోటీపడుతున్నాడు. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం..? అనే విషయంపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా పాక్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ఈ విషయంపై స్పందించాడు. ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లీతో బాబర్ పోటిపడలేడని రజాక్ స్పష్టం చేశాడు.
ఫిట్నెస్ విషయంలో కోహ్లీతో బాబర్ పోటీపడలేడు
విరాట్ కోహ్లీ జట్టును అద్భుతంగా నడిపిస్తాడని, వరల్డ్‌క్లాస్ ఫిట్నెస్ కలిగిన కోహ్లితో బాబర్ పోటీ పడలేడని, ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలంటే బాబర్ కాస్త ఎక్కువ కష్టపడాలని అబ్దుల్ రజాక్ తెలియజేశాడు. పాక్ నెంబర్ ఆటగాడు బాబర్ ఆజం అంతర్జాతీయంగా వన్డేల్లో టాప్ ప్లేయర్ అని, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లో ఎవరు బెటర్? అని ఏం సమాధానం చెబుతామని, వీరిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదని అతను పేర్కొన్నాడు. బాబర్ కంటే కోహ్లీ ఫిట్ నెస్ మెరుగ్గా ఉందని రజాక్ అభిప్రాయపడ్డాడు.