విరాట్ కోహ్లీ న్యూ లుక్ అదుర్స్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా రన్‌మెషీన్ కోహ్లీ కొత్త లుక్‌తో అభిమానులకు దర్శనమిచ్చారు. ఐపీఎల్‌కు ముందే కోహ్లీ జుట్టు కత్తిరించుకున్న న్యూ లుక్‌లో అభిమానులకు కనిపించాడు. ప్రస్తుతం కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ సీజన్ మరికొద్ది ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కొత్త హెయిర్ కట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఫోటోలు చూసిన అభిమానులు 'కోహ్లీ న్యూ లుక్ సూపర్ అంటూ' తెగ కామెంట్లు పెడుతున్నారు.
కొత్త హెయిర్ స్టైల్‌లో అదిరిపోయిన కోహ్లీ
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ కోహ్లీకి కొత్త రూపాన్ని అందించారు. అలీమ్ చాలామంది సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అతనికి బాలీవుడు, క్రికెట్ సెలబ్రిటీలతో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లీకి సూపర్ హెయిర్ స్టైల్ సెట్ చేయడంపై అభిమానులు అలీమ్‌కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పడం విశేషం. విరాట్ ఫామ్ చూస్తుంటే.. ఈసారి ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.