కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించడంపై చాట్ జీపీటీ సమాధానం
సాంకేతిక ప్రపంచంలోకి విప్లవాత్మకంగా దూసుకొచ్చిన చాట్ జీపీటీ ఎన్నో సంచనాలను సృష్టిస్తోంది. ఈ కొత్త తరం సెర్చ్ ఇంజిన్ నెటిజన్లను బాగా అకట్టుకుంటోంది. ఈ టూల్ తో మాట్లాడేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. టీమిండియా రాహుల్ పేలవ ఫామ్ గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం జరిగిన రెండు టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ రాణించకపోవడంతో వైస్ కెప్టెన్ పదవిని బీసీసీఐ తొలగించింది. దీంతో తదుపరి టెస్టులో చోటు దక్కడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో ఓ అభిమాని కూడా రాహుల్ గురించి చాట్‌జీపీటీని ప్రశ్నించాడు. దీంతో చాట్‌జీపీటీ అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
చాట్ జీపీటీ సమాధానికి ఫ్యాన్స్ ఫిదా
వ్యక్తులు, జట్ల పట్ల తనకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని, ముఖ్యంగా పక్షపాత ధోరణి ఉండదని, అయితే సాధారణంగా జరిగే విషయాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ జట్టులో ఉంచాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మాత్రమే తాను సాయం చేస్తానని చాట్ జీపీటీ తెలిపింది. రాహుల్ విషయంలో కూడా వీటన్నింటినీ క్షుణ్ణంగా టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించి, సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని చాట్ జీపీటీ సమాధానం చెప్పింది. చాట్ జీపీటీ సరైన సమాధానం చెప్పిందని చాట్ జీపీటీని అభిమానులు కొనియాడుతున్నారు. ఇక రాహుల్ పేలవ ఫామ్‌పై మాజీ క్రికెటర్లు గొడవపడటం, అభిమానులు తిట్టడం ధాటి రాజకీయ నాయకులు మాట్లాడే స్థాయికి చేరింది.