Page Loader
కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్
టెస్టుల్లో విఫలమవుతున్న కెఎల్ రాహుల్

కేఎల్ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవాలి: దినేష్ కార్తీక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కొంతకాలంగా ఏ మాత్రం రాణించడం లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతని అటతీరు అధ్వాన్నంగా మారింది. శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్లను కాదని జట్టులోకి తీసుకుంటే రాహుల్ అశించిన స్థాయిలో ఆడడం లేదు. రాహుల్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్నా టెస్టుల్లో విఫలమవుతున్నాడు. కేఎల్ రాహుల్ ఆట రోజు రోజుకు దిగజారి పోతుండటంతో సోషల్ మీడియాలో అతనిపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దీనిపై భారత వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ను మూడో టెస్టులో పక్కన పెడతారని, గత ఐదారు టెస్టు మ్యాచ్‌ల్లో అతని ఆటతీరు అలా మారిందని, కొంతకాలం రాహుల్ విశ్రాంతి తీసుకుంటే మంచిదని దినేష్ కార్తీక్ చెప్పారు.

కెఎల్ రాహుల్

రాహుల్ స్థానంలో గిల్‌ను అడించాలి

ప్రస్తుతం రాహుల్ ఫామ్ కోల్పొయి ఇబ్బంది పడుతున్నాడని, అతను ఎదో దీర్ఘంగా ఆలోచించడం వల్లే ఇలా ఫెయిల్ అవుతున్నాడని దినేష్ కార్తీక్ పేర్కొన్నారు. తన కెరీర్‌లో కూడా ఇలాంటి ఫేజ్ అనుభవించానని, కాబట్టి రాహుల్ ఎలా ఫీల్ అవుతున్నాడో తనకు తెలుసు అని, ప్రస్తుతం అతని స్థానంలో శుభ్‌మాన్ గిల్‌ను ఆడిస్తే మంచిదని దినేష్ కార్తీక్ వెల్లడించారు. ఇలాంటి బాధాకరమైన సందర్భాన్ని ఎదుర్కోక తప్పదని ఇదే ఇక చివరి అవకాశం అనే మ్యాచ్‌లో అలా అవుటవడం చాలా బాధగా ఉంటుందని కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే, వన్డేల్లో మళ్లీ ఫ్రెష్‌గా ఆడొచ్చని దినేష్ చెప్పారు.