
రాహుల్‌ను వైస్ కెప్టెన్ నుంచి తప్పించడంపై హర్భజన్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన ఫెయిల్యూర్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన ఆటతీరుతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.
రాహుల్‌ని వైస్ కెప్టెన్ నుంచి తొలిగిస్తే టీమిండియా నుంచి తప్పించడం ఈజీ అని, అందుకే రాహుల్‌ని ఆ పోజిషన్ నుంచి తప్పించారని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
శుబ్‌మాన్ గిల్
రోహిత్ శర్మ, శుబ్‌మాన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రాహుల్, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉండదని హర్భజన్ సింగ్ తెలిపారు.
కెఎల్ రాహుల్ ఎంతో నాణ్యమైన ప్లేయర్ అని, మళ్లీ తిరిగి ఫామ్ కొనసాగిస్తుస్తాడని, ప్రస్తుతం వైస్ కెప్టెన్ ట్యాగ్ లేనందున రోహిత్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందన్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్, మిగతా రెండు టెస్టుల్లో వైస్ కెప్టెన్ ను తొలగించినందుకు అతని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నారు.