IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్ వేలంలో రికార్డు బిడ్డింగ్!
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మెగా వేలం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రికార్డు స్థాయిలో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వేలంలో హాట్ టాపిక్‌గా మారాయి. వేలంలో ముందు సిరాజ్ పేరు ప్రకటనతోనే ఫ్రాంచైజీల మధ్య ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు గత సీజన్‌లో కీలక బౌలర్‌గా రాణించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సాగిన తీవ్ర పోటీలో చివరకు గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
రూ.10 కోట్లకు షమీ దక్కించుకున్న హైదరాబాద్
గత సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన షమీ ఈసారి వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ప్రవేశించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీపడగా, చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్లకు షమీని తమ జట్టులోకి తీసుకుంది. 2022 సీజన్‌లో 20 వికెట్లు, 2023 సీజన్‌లో 28 వికెట్లు తీసిన షమీ, గాయంతో 2024 సీజన్‌కు దూరమైనప్పటికీ, తిరిగి ఫిట్‌నెస్ సాధించి వేలంలోకి వచ్చాడు. మహ్మద్ షమీ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2013లో దిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున రాణించిన షమీ ఈసారి హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు.