స్ట్రైక్-రేట్ 135 కంటే తక్కువ ఉంటే జట్టులోకి నో ఎంట్రీ : షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ సెలక్టర్‌గా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన విషయం తెలిసిందే. వచ్చి రాగానే జాతీయ జట్టులో పెను మార్పులను ఆఫ్రిది చేయాలని నిర్ణయించుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ కోసం టెస్ట్ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ని రీకాల్ చేయాలని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దేశవాళీ క్రికెట్లో స్ట్రైక్ రేట్ 135 కంటే తక్కువగా ఉంటే టీ20 జట్టులో బ్యాటర్ల ఎంపికను నిషేధిస్తున్నట్లు ఆఫ్రిది సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలామంది పాకిస్తానీ బ్యాటర్లు తక్కువ స్ట్రైక్ రైట్ కారణంగా విమర్శలకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఫ్రిది కొత్త నిబంధన పాకిస్తాన్ జట్టులో సంచలన మార్పులను తేనున్నాయి.
ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం
కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా సేథీ, తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా అఫ్రిది నియామకం అయ్యారు. తక్కువ స్ట్రైక్ రేట్ కారణంగా బ్యాటర్ల ఎంపిక చేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. దేశవాళీ టీ20ల్లో 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అనేది పాకిస్తాన్ జట్టు సభ్యులకు వర్తిస్తుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు గతంలో చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు.