NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Sunil Chhetri: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సునీల్‌ ఛెత్రి
    తదుపరి వార్తా కథనం
    Sunil Chhetri: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సునీల్‌ ఛెత్రి
    రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సునీల్‌ ఛెత్రి

    Sunil Chhetri: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న సునీల్‌ ఛెత్రి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛెత్రి మరోసారి మైదానంలో సందడి చేయనున్నాడు. అతను తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.

    ''సునీల్‌ ఛెత్రి తిరిగి వచ్చాడు. భారత ఫుట్‌బాల్‌ మహా నాయకుడు, కెప్టెన్‌ మార్చి నెలలో జరగనున్న ఫిఫా మ్యాచ్‌ల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు'' అని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎక్స్‌లో వెల్లడించింది.

    40 ఏళ్ల ఛెత్రి గతేడాది జూన్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.

    అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకున్నప్పటికీ, అతను ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో 12 గోల్స్‌తో అత్యధిక గోల్స్‌ చేసిన భారత ఆటగాళ్లలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

    వివరాలు 

    బంగ్లాదేశ్, మాల్దీవులతో కీలకమైన మ్యాచ్‌లు

    గత సీజన్‌లో పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు ఎఫ్‌సీ, సునీల్‌ ఛెత్రి అద్భుత ప్రదర్శనతో ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

    అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న ఛెత్రి, ఏఐఎఫ్‌ఎఫ్‌ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్‌ను తిరస్కరించి తిరిగి జట్టులోకి వచ్చాడు.

    భారత జట్టు ఈ నెలలో బంగ్లాదేశ్, మాల్దీవులతో కీలకమైన మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఏఐఎఫ్‌ఎఫ్‌ చేసిన ట్వీట్ 

    Captain. Leader. Legend. SUNIL CHHETRI IS BACK! 🇮🇳🔥

    40 saal ka junoon, ek baar phir Indian jersey mein! 🏆⚽
    March 25, Shillong – pura stadium hilega, kyunki yeh sirf ek comeback nahi, ek INSPIRATION hai!#AFCAsianCup #allindiafootball #SunilChhetri #IndianFootball #SC11 pic.twitter.com/nVfygFHTtU

    — All India Football (@AllIndiaFtbl) March 6, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సునీల్ ఛెత్రి

    తాజా

    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ

    సునీల్ ఛెత్రి

    భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ ఫుట్ బాల్
    9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్ ఫుట్ బాల్
    2023 శాఫ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి ఫుట్ బాల్
    FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే! ఫుట్ బాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025