LOADING...
T20 World Cup 2026 : సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఫేవరెట్ల జాబితాలో టీమిండియా గైర్హాజరు!
సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఫేవరెట్ల జాబితాలో టీమిండియా గైర్హాజరు!

T20 World Cup 2026 : సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. ఫేవరెట్ల జాబితాలో టీమిండియా గైర్హాజరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్లైమాక్స్ దశకు చేరుకుంటుండగా ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి టైటిల్ ఫేవరెట్ల జాబితాలో నుంచి ఆయన టీమిండియాను పూర్తిగా పక్కన పెట్టేశారు. భారత్ సెమీఫైనల్ రేసులో ఉన్నప్పటికీ, కప్పు గెలిచే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్, సౌతాఫ్రికాలకే ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ స్పష్టం చేశారు. సొంత గడ్డపై టోర్నీ జరుగుతుండగా భారత్‌కు మద్దతు ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సూపర్ 8 దశలో పరిస్థితులు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. భారత్, విండీస్ క్రికెట్ జట్టు సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి.

Details

బౌలింగ్-బ్యాటింగ్ డెప్త్‌పై ప్రశంసలు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అయితే గవాస్కర్ మాత్రం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల బౌలింగ్-బ్యాటింగ్ డెప్త్‌పై ప్రశంసలు కురిపించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అయితే గవాస్కర్ మాత్రం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల బౌలింగ్-బ్యాటింగ్ డెప్త్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సౌతాఫ్రికా ఇప్పటివరకు టోర్నీలో ఓటమి లేకుండా దూసుకుపోతూ గ్రూప్ దశలో కెనడా, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్‌లను ఓడించింది. సూపర్ 8లో భారత్, వెస్టిండీస్‌లను కూడా జయించి సెమీస్‌లో స్థానం ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ విషయానికి వస్తే.. స్పిన్, పేస్ బౌలింగ్ విభాగాలు బలంగా ఉన్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

Details

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లే అసలైన ఫేవరెట్లు

టోర్నీ ఆరంభంలో నేపాల్‌పై కష్టపడి గెలిచి, వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్‌లను స్పిన్ ట్రాక్‌లపై ఓడించడం జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. "నా దృష్టిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లే అసలైన ఫేవరెట్లు. భారత్ కంటే ఈ రెండు జట్లకే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సెమీఫైనల్ సమీకరణాల ప్రకారం సౌతాఫ్రికా తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే టేబుల్ టాపర్‌గా అవతరిస్తుంది.

Advertisement

Details

భారత్‌ను తక్కువ అంచనా వేయడంపై విమర్శలు

అలా జరిగితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ లేదా వెస్టిండీస్‌తో తలపడే అవకాశం ఉంటుంది. గవాస్కర్ అంచనాలు నిజమవుతాయా? లేక విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెబుతూ టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గవాస్కర్ లాంటి దిగ్గజం భారత్‌ను తక్కువ అంచనా వేయడం అభిమానులకు మాత్రం మింగుడుపడటం లేదు.

Advertisement