ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ సెంచరీ.. బద్దలైన రికార్డులివే!
వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారించాడు. 49 బంతుల్లోనే 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 103 రన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా సూర్యకుమార్ రికార్డుకెక్కాడు. అంతకుముందు జయసూర్య(114), రోహిత్ శర్మ(109) టాప్ టూ ప్లేస్ లో ఉన్నారు. వారి తర్వాతి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
ముంబై ఇండియన్స్ తరుపున 2416 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్
అదే విధంగా ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ గా సూర్యకుమార్ నిలిచాడు. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ 2416 రన్స్ చేయడం విశేషం. వాంఖడే స్టేడియంలో 12 ఏళ్ల తరువాత ముంబై ఇండియన్స్ కు ఇదే తొలి శతకం కావడం విశేషం. చివరిసారిగా 2011లో సచిన్ సెంచరీని బాదాడు. సచిన్ తర్వాత ముంబై వేదికలో సెంచరీ కొట్టిన క్రికెటర్ సూర్యకుమార్ చరిత్రకెక్కాడు. అయితే గుజరాత్ తరుపున ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు (10 సిక్సర్లు) కొట్టిన ప్లేయర్ గా రషీద్ ఖాన్ నిలిచాడు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి