
MI Vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వాంఖడే స్టేడియంలో పరుగుల సునామీని సృష్టించాడు. 57వ మ్యాచ్లో ముంబై, గుజరాత్ తలపడ్డాయి.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరును చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.
దీంతో ముంబై 218 పరుగులు చేసింది. తర్వాత ఇషాన్ కిషాన్ (31), రోహిత్ శర్మ (29) విష్ణు వినోద్ (30) పరుగులతో రాణించారు.
చివరి బంతికి సిక్సర్ బాదిన సూర్యకుమార్ తన ఐపీఎల్ కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ (252) రెండోస్థానానికి ఎగబాకాడు.
గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో మెరిశాడు.
Details
27 పరుగుల తేడాతో ముంబై విజయం
లక్ష్య చేధనకు బ్యాటింగ్ గుజరాత్ మొదట్లో తడబడింది. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సాహా(2), గిల్(6), హార్థిక్ పాండ్యా 4 పరుగులతో పూర్తిగా నిరాశపరిచారు.
మిల్లర్ 41 పరుగులతో రాణించగా.. చివర్లో రషీద్ ఖాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 32 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 79 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
చివర్లో రన్ రేట్ పెరిగిపోవడంతో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై గెలుపుతో ఫ్లేఆఫ్ కు మరింత దగ్గరైంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ఆకాష్ మధ్వల్ 3, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలా రెండు వికెట్లు సాధించారు.