LOADING...
Ind Vs Zim: జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

Ind Vs Zim: జింబాబ్వేపై భారత్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
10:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్ ఆశలను బలంగా నిలబెట్టుకుంది. సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు నమోదు చేసింది. ఆ తరువాత 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే తరఫున బ్రియాన్ బెనెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. సికిందర్ రజా 31 పరుగులు, మరుమాని 20 పరుగులు చేశారు.

vivaralu

అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు

అయితే మిగతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీసి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

వివరాలు 

అర్ద సెంచరీ చేసి అభిషేక్,హార్దిక్

భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్య (50 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), తిలక్ వర్మ (44; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి స్కోరును భారీగా పెంచారు. ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు, సంజు శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి దూకుడు చూపించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగరవ,ముజరబాని,మపోస,సికిందర్ రజా తలో వికెట్ సాధించారు.

Advertisement