LOADING...
T20 World Cup 2026 : ఇట‌లీపై 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం..
ఇట‌లీపై 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం..

T20 World Cup 2026 : ఇట‌లీపై 42 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశను విజయంతో ముగించింది. వరుసగా నాల్గో మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇటలీతో జరిగిన పోరులో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన ఇటలీ జట్టు 17.4 ఓవర్లలోనే 125 పరుగులకు ఆలౌటైంది. ఇటలీ బ్యాటర్లలో బెన్ మనేంటి 21 బంతుల్లో 26 పరుగులు చేసి 2 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. జెజె స్మట్స్ 27 బంతుల్లో 24 పరుగులు చేసి 3 ఫోర్లు నమోదు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీశాడు.

వివరాలు 

అర్థశతకం సాధించి జట్టుకు బలమైన పునాది వేసిన షాయ్ హోప్

షామర్ జోసెఫ్, గుడాకేష్ మోతీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అకేల్ హోసిన్ ఒక వికెట్ సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు నమోదు చేసింది. షాయ్ హోప్ 46 బంతుల్లో 75 పరుగులు చేసి 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థశతకం సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు. రోస్టన్ ఛేజ్ 24 పరుగులు చేయగా,షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మాథ్యూ ఫోర్డ్ 16 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇటలీ బౌలర్లలో బెన్ మనేంటి,క్రిషన్ కలుగమాగే చెరో రెండు వికెట్లు దక్కించుకోగా,అలీ హసన్,థామస్ డ్రాకా ఒక్కో వికెట్ సాధించారు.

Advertisement