LOADING...
MS Dhoni: భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందా?.. ధోని సమాధానం ఇదే..
భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందా?.. ధోని సమాధానం ఇదే..

MS Dhoni: భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందా?.. ధోని సమాధానం ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ ఈ నెల 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలపై ప్రారంభం కానుంది. ఈ పోటీ ప్రపంచకప్ విజేత ఎవరో అనే విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ధోనీ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లు సమానంగా జాగ్రత్తగా ఉండాల్సినవే అని అన్నారు. కానీ, అన్ని జట్లలో భారత్ జట్టు ప్రత్యేకంగా ప్రమాదకరమైనదని, మన యువ ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని ధోనీ పేర్కొన్నారు. పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని అన్నారు.

వివరాలు 

అదే భయపెడుతోంది..

మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పారు. మ్యాచ్‌లను నిర్వహించే వేదికల వాతావరణ పరిస్థితులు ఆటగాళ్లకు కష్టాలను సృష్టించగలవని అన్నారు. శీతాకాలం కారణంగా కొన్ని నగరాల్లో మంచు కురిసే అవకాశం ఉంది, దీని వల్ల మ్యాచ్‌లపై ప్రభావం తప్పనిసరి అని చెప్పారు. ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ డ్యూ (మంచు) అంటే భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ఇలాంటి సమయంలో టాస్‌ కీలక పాత్ర పోషిస్తుందని ధోని చెప్పుకొచ్చారు.

Advertisement